తమిళ్ లో మోస్ట్ బ్యాచ్ లర్ హీరో ఎవరంటే విశాల్ అని చెప్పొచ్చు. అందుకే తన పెళ్లిపై వచ్చే వార్తలు ఎప్పుడూ వైరల్ గానే మారుతాయి. గతంలో విశాల్ కు ఎంగేజ్ మెంట్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం ఆగిపోయింది. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ అభినయతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అభినయ స్పందించి అలాంటిది ఏం లేదని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది. ఇక తాజాగా మరోసారి విశాల్ పెళ్లిపై చర్చ హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం విశాల్ చేసిన వ్యాఖ్యలే కారణం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మీడియో సమావేశంలో పాల్గొన్న విశాల్ తనకు అరెంజ్‌డ్ మ్యారేజ్ సెట్ కాదని, లవ్ మ్యారేజ్‌నే చేసుకోవాలని ఉందని ఆయన అన్నారు. ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేస్తా.. త్వరలోనే ఆమెను మీకు పరిచయం చేస్తానని విశాల్ చెప్పటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మరి ఆయన ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరు? ఎప్పుడు పరిచయం చేస్తారు? అనే విషయాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న సినిమా లాఠీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మార్క్ ఆంటోని అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు విశాల్ లిస్ట్ లో ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























