బ్లాక్ బస్టర్ టెర్మినేటర్, టైటానిక్, పిరాన్హ 2 వంటి హాలీవుడ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీస్ ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల కలెక్షన్స్ ను స్వంతం చేసుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
On December 16, return to Pandora.
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. pic.twitter.com/UtxAbycCIc
— Avatar (@officialavatar) November 2, 2022
లైట్ స్ట్రామ్ ఎంటర్టైన్మెంట్-టీఎస్జీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్ వర్తింగ్టన్, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ ని ప్రధాన భారతీయ భాషలన్నింటిలో రిలీజ్ కానుంది. భారత్లో ఈ ఏడాది డిసెంబరు 16న విడుదల కానుంది. మిగతా దేశాల్లో డిసెంబరు 14న రిలీజ్ కానున్నట్లు సమాచారం.సరికొత్త టెక్నాలిజీతో తెరకెక్కిన ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 భాషల్లో మేకర్స్ విడుదల చేయనున్నారు. త్రీడీలోనే కాకుండా 4కె, లైవ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ వంటి మరింత అత్యాధునిక సాంకేతికత అంశాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి జేమ్స్ కామెరాన్ ప్రయత్నిస్తున్నారు. టెక్నాలజీ పరంగానే ఈ సినిమాకు పలు వెర్షన్లు ఉన్నాయని సమాచారం. తాజాగా మేకర్స్ ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: