జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమా ప్రిన్స్. ఇప్పటివరకూ తెలుగు డబ్బింగ్ సినిమాలతో అలరించిన శివకార్తికేయన్ ఈసినిమాతో తెలుగులో స్టైయిట్ గా వస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. హిట్ అయిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు..శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.
దర్శకత్వం.. అనుదీప్
బ్యానర్స్..శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్
నిర్మాతలు.. సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు
సినిమాటోగ్రఫి.. మనోజ్ పరమహంస
సంగీతం..ఎస్. ఎస్. థమన్
కథ
విశ్వనాథ్(సత్యరాజ్) ది కృష్ణా జిల్లా దేవరకోటలోని ఓ స్వతంత్ర సమరయోధుల కుటుంబం. మొదటి నుండీ మానవత్వ విలువలు పాటించే వ్యక్తి విశ్వనాథ్. ఇక విశ్వనాథ్ కొడుకే ఆనంద్ (శివ కార్తికేయన్). స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో బ్రిటీష్ కుటుంబానికి చెందిన తోటి టీచర్ జెస్సికా (మరియా)తో ఆనంద్ ప్రేమలో పడతాడు. కానీ ఆమె బ్రిటీషర్ అని తెలుసుకుని స్వాతంత్రోద్యమం గుర్తొచ్చి వద్దంటాడు. మరి తనకు ప్రేమను ఆనంద్ ఎలా దక్కించుకున్నాడు.. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయా? సరిహద్దుల్లేని ప్రేమ ఆనంద్‌ను ఊరి నుంచి వెలివేసేందుకు ఎలా కారణమైంది? చివరికి ఆనంద్, జెస్సికా ఒక్కటవుతారా? అనేదే సినిమా.
విశ్లేషణ..
జాతిరత్నాలు సినిమా తీసిన తరువాత అనుదీప్ ఇండస్ట్రీలో ఎంత మంచి గుర్తింపు వచ్చిందో తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతేకాదు రియల్ లైఫ్ లో కూడా అనుదీప్ కామెడీ టైమింగ్ కు చాలా మంది ఫిదా అయిపోయారు. దీంతో ఈసినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. మరోవైపు శివకార్తికేయన్ కూడా హీరో అవ్వడంతో ఆడియన్స్ కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరోసారి ఈసినిమాలో కూడా అనుదీప్ తన కామెడీ మార్క్ ను చూపించాడు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా ఫన్ తోనే మరోసారి సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. కామెడీనే నమ్ముకుని దానితోనే ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. తన స్టైల్ కామెడీ వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి. కుల, మత, జాతి విభేధాలు అనే సున్నితమైన అంశాన్ని అనుదీప్ చాలా కూల్‌గా డీల్ చేశాడు. కామెడీ చేస్తూనే మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని సింపుల్‌గా ఎక్కించాడు. ఈ కథకు ప్రధాన బలం సినిమాలోని పాత్రల మాటలు.
పెర్ఫామెన్స్
శివ కార్తికేయన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో పాత్రల ద్వారా నటుడిగా నిరూపించుకున్నాడు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఈసినిమాతో తెలుగులోకి స్ట్రైయిట్ గా ఎంట్రీ ఇచ్చాడు. శివకార్తికేయన్ మొత్తం తన భుజంపై మోసాడు. అతనికి ఇలాంటి కామెడీ పాత్రలు చాలా తాలా తేలిక. ఎప్పటిలాగే ఈ సినిమాలో ఎలాంటి బాధ్యతలు లేకుండా జాలీగా తిరిగే ఒక కొడుకు పాత్రలో జీవించేశాడు. క్లైమాక్స్ లో నేనొక్కడ్నే నిజమైన దేశ భక్తుడిని.. ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనేది పాటించి బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించాను అని శివకార్తికేయన్ చెప్పే డైలాగ్ హైలెట్ గా ఉన్నాయి. జెస్సికా పాత్రలో నటించిన మరియాకు కూడా ఈసినిమా ఇక్కడ మొదట సినిమా అయినా కూడా తను కూడా తన నటనతో ఆకట్టుకుంది. సీనియర్ నటుడు సత్యదేవ్ తనకిచ్చిన పాత్రకు న్యాయం చేశారు. సినిమా మొత్తాన్ని నడిపించడంలో ప్రేమ్‌జీ అమరేన్ ది కూడా ముఖ్య పాత్ర.
టెక్నికల్ విభాగానికి వస్తే ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ కాబట్టి వంక పెట్టాల్సిన అవసరం లేదు. పాటలు సంగతి పక్కపెడితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంటుంది. థమన్ సంగీతం అందించడంతో పాటు పాడిన జెస్సికా, బింబిలిక్కి పాటలు బాగానే వర్కవుట్ అయ్యాయి. మనోజ్ పరమహంస వంటి టాప్ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకు పనిచేసారు. మనోజ్ పరమహంస అందించిగా విజువల్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కూడా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. కామెడీ ఎంటర్ టైన్మెంట్ సినిమాలు చూసేవాళ్లకు ఈసినిమా చాలా బాగా నచ్చుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: