మరోసారి బాలకృష్ణతో బోయపాటి?

Balakrishna To Work With Boyapati Srinu Again, Balakrishna and Boyapati to team up, Boyapati Srinu and Balakrishna's fourth film, Balakrishna's film, Boyapati Srinu to direct Balakrishna Again, Nandamuri Balakrishna, Director Boyapati Srinu, Balakrishna's Upcoming Movie, Balakrishna Latest Movie, Legend, Akhanda, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

నందమూరి బాలకృష్ణ-బోయిపాటి శ్రీను వీరిద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటది. చాలా పవర్ ఫుల్ కాంబినేషన్. ఆ విషయం ఇప్పటికే వీరిద్దరూ నిరూపించారు కూడా.. సింహా సినిమాతో మొదలైన వీరిద్దరి కాంబినేషన్ ఆతరువత లెజెండ్, రీసెంట్ గా అఖండ వరకూ సాగింది. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాయి. బోయపాటి శ్రీను మాస్ కు బాలకృష్ణ లాంటి హీరో తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమాల ఫలితాలే నిదర్శనం. సింహా సినిమాతో క్రేజీ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ నమ్మకంతోనే లెజెండ్ సినిమాను తెరకెక్కించారు. ఇక రీసెంట్ గా అఖండ సినిమాతో హ్యాట్రిక్ ను కొట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
పొలిటికల్ డ్రామాతో కూడిన యాక్షన్ తో ఈసినిమా రానుందని అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే బోయపాటి కథ చెప్పడం .. బాలయ్య ఓకే అనడం జరిగిపోయాయని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టు వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ప్రస్తుతం అయితే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇది మాస్ యాక్షన్ జోనర్లో రూపొందుతోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈసినిమా రీసెంట్ గానే టర్కీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. గోపీచంద్ మలినేని తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు బాలయ్య. ఇక ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆ తరువాత ఆయన బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళతారేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + nine =