ఏదైనా పండుగ వచ్చిందంటే ఇండస్ట్రీలో కూడా పండుగ వచ్చినట్టే. పలు సినిమాల రిలీజ్ లు ప్రేక్షకులతో బాక్సాఫీస్ వద్ద కూడా పండుగ వాతావరణమే ఉంటుంది. ఇక విజయదశమి సందర్భంగా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాయి. అవి చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన గాడ్ ఫాదర్, నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన ది ఘోస్ట్, అలానే బెల్లంకొండ హీరోగా వచ్చిన స్వాతిముత్యం సినిమా. మూడు సినిమాలు కూడా రిలీజ్ అయి ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జోనర్లలో వచ్చాయి. గాడ్ ఫాదర్ సినిమా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఈసినిమా మొదటి షో నుండే ఫుల్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. మరోవైపు ది ఘోస్ట్ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. ఈసినిమాలోని హాలీవుడ్ రేంజ్ లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా నిలుస్తున్నాయి. ఈసినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక బెల్లకొండ గణేష్ హీరోగా వచ్చిన సినిమా స్వాతిముత్యం కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రన్ అవుతుంది. అంతేకాదు ఈసినిమాతోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన గణేష్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. డీసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ తో బెల్లంకొండ గణేష్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడని.. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందరూ. ఇక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా కూడా హిట్ ను సొంతం చేసుకుంది.
మరి ప్రస్తుతం అయితే మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయి ఇండస్ట్రీకి మరింత ఊపునిచ్చాయి. ఇక ఈ మూడు సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: