మంచు విష్ణు నుండి సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఈనేపథ్యంలో మంచు విష్ణు కూడా మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. హారర్ కామెడీ నేపథ్యంలో ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అంతేకాదు విష్ణు కూడా ఈసినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఈసినిమా షూటింగ్ మొదలైనప్పటినుండీ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు కానీ గ్లింప్స్ వీడియో, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఈ సినిమాలో ‘గోలిసోడా’ అంటూ సాగే పెప్పీ నెంబర్ పాటను రిలీజ్ చేశారు. ఈపాట ప్రోమోను నిన్న రిలీజ్ చేయగా నేడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తో కలిసి విష్ణు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. అనుప్ రుబెన్స్ మ్యూజిక్ అందివ్వగా.. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు.
#𝐆𝐨𝐥𝐢𝐒𝐨𝐝𝐚 the 𝐔𝚙𝐁𝚎𝚊𝚝 Lyrical Video from #𝔾𝕀ℕℕ𝔸🔥 is out now!
▶️https://t.co/ivsxkz7rjO#DynamicStar⭐️@iVishnuManchu @starlingpayal @SunnyLeone
🎵@anuprubens
🕺@pddancing
🎤@aziznakash @nutana_mohan
✍️#Balaji #GoliSodaSong @avaentofficial @saregamasouth— 24 Frames Factory (@24FramesFactory) September 19, 2022
కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. అక్టోబర్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: