శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన యశోద మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన యశోద మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.తాజాగా చిత్ర యూనిట్ యశోద మూవీ టీజర్ ను దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ చేసింది. అద్భుతమైన విజువల్స్ తో రూపొందిన టీజర్ ఆసక్తిని కలిగించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద మూవీ టీజర్ 1800 పైగా థియేటర్స్ లో రిలీజ్ కావడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























