తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్” హిందీ మూవీ షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తాజాగా తమన్నా ఒక మూవీ లో తలైవా రజనీకాంత్ కు జోడీగా ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “డాక్టర్”, “బీస్ట్”మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “జైలర్ ” తమిళ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ లో కథానాయికగా తమన్నా ఎంపిక అయినట్టు సమాచారం. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటించనున్న రజనీకాంత్“జైలర్ “మూవీ కై రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీసెట్స్ రూపొందుతున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































