‘సీతారామం’ డైరెక్టర్ పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Nag Ashwin Interesting Comments About Hanu Raghavapudi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest,Sitaramam,Sitaramam Movie,Sitaramam Movie latest Updates,Sitarmam Movie Director,Hanu Raghavapudi, Hanu Raghavapudi Sitaramam Movie Director,Nag Ashwin,Director Nag Ashwin Praises Sitaramam Movie Director,Nag Ashwin Interesting Comments on Hanu Raghavapudi,Nag Ashwin Interesting Comments On Sitaramam Movie Director

అందమైన ప్రేమకథలను తెరపైన చూపించడం.. ప్రేక్షకులను మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. కమర్షియల్ సినిమాలు ఆడినంత ఈజీగా ప్రేమ కథలు ఆడటం చాలా కష్టం. అందులోనూ స్లోగా సాగే లవ్ స్టోరీస్ ను ప్రేక్షకులు కనెక్ట్ చేయాలంటే డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా కథను నడపాలి. ఇప్పుడున్న కాంపిటీషన్ లో అయితే అలాంటి ప్రేమకథలను తీసి సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్ ను ఆకట్టుకునే డైరెక్టర్లు చాలా అరుదుగా ఉన్నారు. వారిలో హను రాఘవపూడి ఒకరు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన డైరెక్టర్ హను రాఘవపూడి. లావ‌ణ్య త్రిపాఠి, న‌వీన్ చంద్ర హీరోహీరోయిన్లుగా, రాహుల్ ర‌వీంద్ర‌న్ మరో లీడ్ రోల్‌లో న‌టించారు. దర్శ‌కుడిగా తొలి సినిమాతోనే మంచి బ్రేక్ అందుకున్నారు హ‌ను రాఘ‌వ పూడి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా హ‌ను రాఘ‌వ‌పూడికి డైరెక్ట‌ర్‌గా ప్ర‌యాణం మొద‌లుపెట్టి ప‌దేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈసందర్భంగా హను రాఘవపూడి దశాబ్దం పాటు తనకు సపోర్ట్ ఇచ్చినవారికి థ్యాంక్యూ చెబుతున్నాడు. ఇప్పటికే దశాబ్దం అయిందంటే నమ్మలేకపోతున్నా. అందాల రాక్షసి చిత్రం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. నాపై ఇంత ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు..అంటూ ద‌శాబ్ద‌కాలం పూర్త‌యిన సంద‌ర్బాన్ని గుర్తు చేసుకుని ట్వీట్ చేశాడు. ఇక ఈసందర్భంగా నాగ్ అశ్విన్ హను రాఘవపూడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 10 ఏళ్ల క్రితం నేను ఒక్కడినే అందాల రాక్షసి సినిమా చూడటానికి వెళ్లాను. ఎవరైతే తన క్రాఫ్ట్ ను ప్రేమిస్తారో, ఇష్టపడతారో అలాంటి వారే ఈసినిమాను తీయగలరని తెలిపారు. హను ఎప్పుడూ తనకు అన్నీ కలిసొచ్చే విధంగా సినిమాలు తీస్తాడు.. ఈసారి వైజయంతీ బ్యానర్ కు ఆ అవకాశం దక్కింది.. తన సినీ కెరీర్ లో దశాబ్దం పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలియచేస్తున్నాను అంటూ తెలిపాడు.

ఇక రీసెంట్ గా సీతారామం తో మరో క్లాసిక్ హిట్ ను అందుకున్నారు హను రాఘవపూడి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నఈసినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. చాలా కాలం తర్వాత ఇలాంటి క్లాసిక్ లవ్ సినిమాని అందించినందుకు ప్రేక్షకులు, విమర్శకులు మరియు సినీ ప్రేమికులందరూ దర్శకుడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హృదయాన్ని హత్తుకునే కథనంతో ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =