మహేష్ రక్షాబంధన్ విషెస్..!

Mahesh Babu sends his Raksha Bandhan Wishes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest,Mahesh Babu, Super Star Mahesh Babu,Mahesh Babu Sends Raksha Bandhan Wishes,Raksha Bandhan Wishes From Mahesh Babu,Mahesh Babu Latest Updates,Mahesh Babu Latest Movie Updates,Mahesh Babu Wishes His Fan on Raksha Bandhan,Sitara,Gautham Ghattamaneni,Mahesh Babu Daughter Sitara and Son Gautham Ghattamaneni Celebrates Raksha Bandhan 

నేడు రక్షాబంధన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా అందరూ రక్షా బంధన్ ను జరుపుకుంటారు. సెలబ్రిటీలు కూడా తమ తమ తోబుట్టువులతో జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు సితార-గౌతమ్ లు కూడా రక్షాబంధన్ ను జరుపుకున్నారు. ఈసందర్బంగా మహేష్ తన ట్విట్టర్ ద్వారా సితార-గౌతమ్ ల ఫొటోలను పోస్ట్ చేస్తూ ఒక విడదీయరాని బంధం.. ఒక జీవితకాల వాగ్దానం అంటూ అందరికీ రాఖీ విషెస్ తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మహేష్. పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా మే 12న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది. . ఇక తన తరువాత సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈసినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ బాబు సరసన మరోసారి పూజా హెగ్డే నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా వ్యవహరించబోతోన్నారు.

ఇక రాజమౌళి తో కూడా మహేష్ సినిమా చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ మాత్రం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ సెట్స్ పైకి రావాలంటే మాత్రం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.