ఈవారం రిలీజ్.. ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?

For Which Movie Release You Aare Eagerly Waiting?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Macherla Niyojakavargam, Karthikeya 2 And Laal Singh Chaddha: Which Movie Are You Excited For This Weekend? Vote Now,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Weekend Movies,Movies This Weekend To Watch,Movie Releasing This Weekend,Nithiin and Krithi Shetty Macherla Niyojakavargam Releasing,Nikhil Siddharth and Anupama Parameswaran Karthikeya 2 Movie,Amir Khan and Nagachaitanya Upcoming Movie Laal Singh Chaddha Releasing This Weekend,Movie That are Excited to Watch This Weekend,Movies Releasing in August 2nd Week

గత వారం రిలీజ్ అయిన రెండు సినిమాలు టాలీవుడ్ కు మళ్లీ కొత్త ఊపునిచ్చాయి. ప్రేమకథగా వచ్చిన సీతారామం ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను తాకి క్లాసిక్ హిట్ కొట్టగా.. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన బింబిసార కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని దూసుకుపోతున్నాయి. ఇక గత వారం ఎఫెక్ట్ తో ఈవారం రిలీజ్ లపై కూడా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దమయ్యాయి. అందులో లాల్ సింగ్ చద్దా, మాచర్ల నియోజక వర్గం, కార్తికేయ2 సినిమాలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీటిలో లాల్ సింగ్ చద్దా ఆగష్ట్ 11, మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఆగష్ట్ 12న రిలీజ్ అవుతుండగా.. కార్తికేయ 2 ఆగష్ట్ 13న రిలీజ్ కాబోతుంది. ఈ మూడు సినిమాలపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మూడు సినిమాలూ వేటికవే డిఫరెంట్ జోనర్లలో వస్తున్నాయి. లాల్ సింగ్ చద్దా లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా నాగ చైతన్య నటిస్తుండటం.. దానికి తోడు చిరు తెలుగులో సమర్పిస్తుండటం.. ఇక ప్రివ్యూలకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. మరోవైపు మాచర్ల నియోజక వర్గంలో మొదటి సారి నితిన్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో మాస్ రోల్ లో కనిపిస్తున్నాడు. కార్తికేయ 2 గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్తికేయ సినిమాకు ఈసినిమా సీక్వెల్. కార్తికేయ సినిమా సూపర్ హిట్ సినిమా.. దీంతో కార్తికేయ2 పై మొదటి నుండి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూడు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఎలాంటి ఫలితాలు అందిస్తాయో చూడాలి.

మరి ఈమూడు సినిమాల్లో మీరు ఏసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

[totalpoll id=”85475″]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.