ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “బింబిసార” మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “బింబిసార” మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో “బింబిసార” మూవీ సక్సెస్ మీట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ…ఈ సినిమా ప్రారంభించిన కొద్ది రోజులకే పాండమిక్ మొదలైందనీ , మూడున్నర నెలలు లాక్ డౌన్ పెట్టారనీ , మళ్లీ షూటింగ్ జరిపాక సెకండ్ వేవ్ వచ్చిందనీ , ఆ
పరిస్థితుల్లో చాలా అసహనానికి గురయ్యామనీ , సినిమా విడుదల చేశాక కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అనుకున్నాం కానీ మా నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టిందనీ , ఈ విజయం తనకు పునర్జన్మ లాంటిదనీ , మీరు అందించిన విజయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇకపై మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తాననీ ,తాను ఇకపై నటించే ప్రతి సినిమా కొత్తగా ఉండేలా చూసుకుంటాననీ చెప్పారు.నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…ఒక సినిమా అనుకున్నట్లు రావాలంటే నిర్మాత, హీరో, దర్శకుడు ఈ ముగ్గురే ప్రధాన కారణమనీ , వారు సమన్వయంతో ఉంటే ఖచ్చితంగా మంచి చిత్రం బయటకొస్తుందనే విషయం ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ చిత్రాన్ని చూసి మేమంతా నేర్చుకోవాలనీ , మూడు నాలుగు రోజుల్లోనే బయ్యర్లకు లాభాలు రావడం సంతోషకరమనీ , ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































