ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “బింబిసార” మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “బింబిసార” మూవీ ని సోషల్ మీడియా ద్వారా ప్రశంసించారు. “బింబిసార” చిత్ర బృందానికి గొప్ప అభినందనలనీ , చాలా ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఫాంటసీ చిత్రంతో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కళ్యాణ్ రామ్ అదరగొట్టారనీ , ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, కొత్త తరహా చిత్రాల్ని ప్రయత్నిస్తున్నందుకు ఆయనపై గౌరవం కలుగుతోందనీ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ చేసిన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: