హీరో బాలకృష్ణ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం NBK 107 షూటింగ్ కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారం కు హీరో బాలకృష్ణ ఎంపిక అయినట్టు అధికారిక ప్రకటన వచ్చింది. మహా కవి సి. నారాయణ రెడ్డి 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా జులై 30వ తేదీన రవీంద్రభారతిలో ఈ పురస్కారం బాలకృష్ణ కు అందజేయబోతున్నారనీ ,ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు హాజరు కాబోతున్నారనీ సమాచారం. బాలకృష్ణకు ఈ అరుదైన పురస్కారం లభించడం పట్ల నందమూరి అభిమాన వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































