‘NTR 30’.. సెప్టెంబర్ నుండి షురూ..!

Koratala Siva and NTR Movie Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Movie Updates,Jr NTR With Koratala Siva,Jr NTR and Koratala Siva Latest Movie Updates,Jr NTR Moviw With Director koratala Siva, Koratala Siva nd Jr NTR Movie Shooting latest Updates,Jr NTR Shooting Updates,Jr NTR New Movie Updates,Jr NTR Upcoming Movies,Jr NTR New Movies,Jr NTR Latest Updates, Koratala Siva,Director Koratala Siva,Koratala Siva Movies Updates,Koratala Siva Shooting Updates,#NTR30,Jr NTR #NTR30 Movie Shooting Starts From September,Koratal Siva and Jr NTR #NTR30 Movie Shooting Updates

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా కమిట్ అయినప్పుడే చాలా గ్యాప్ వస్తుందని ఫిక్స్ అయిపోయారు. అయితే దానికి తోడు కరోనా రావడం వల్ల ఈసినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఇక ఆర్ఆర్ఆర్ కూడా రిలీజ్ అయిపోయింది.. కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈసినిమా రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా ఇప్పటి వరకూ ఎన్టీఆర్ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. మరోవైపు ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ తో నటించిన రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో కొత్త సినిమాను ఎప్పుడు మొదలుపెడతాడా అని చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి వీడియోను రిలీజ్ చేశారు. సముద్రం, పడవలు, ఎన్టీఆర్ రెండు చేతుల్లో రెండు ఆయుధాలు ఉన్న వీడియోను బట్టి మరో ఫుల్ యాక్షన్ సినిమాతో రాబోతున్నట్టు అర్థమయింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ను సెప్టెంబర్ రెండో వారం నుండి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.

కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నట్టు తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.