డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీపై హాలీవుడ్ రైటర్స్ , డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “బాహుబలి “, బహుబలి2 ” మూవీస్ తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన దర్శకుడు రాజమౌళి మరోసారి “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తో సత్తా చాటారు. నెట్ ఫ్లిక్స్ మరియు జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్, జీ 5 లేని ప్రేక్షకులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “ఆర్ ఆర్ ఆర్ ” మూవీని చూసి ఎంజాయ్ చేయండి.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























