వెంకట్ ప్రభు డైరెక్షన్లో శింబు హీరోగా ‘మానాడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది రిలీజ్ అయి హిట్ అయిన సినిమాల్లో ఈసినిమా కూడా ఒకటి. చాలా కాలం తర్వాత శింబు ఈ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఓటీటీలో కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా తెలుగు హక్కులను సురేష్ ప్రొడక్షన్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ముందు ఈ రీమేక్ లో రవితేజ నటిస్తున్నట్టు ఆ తరువాత మరో ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చాయి. రీసెంట్ గా ఈ రీమేక్ లో నాగ చైతన్య నటిస్తున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ రీమేక్ లో ఎవరు నటిస్తున్నారన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. . అయితే స్వయంగా నాగ చైతన్యనే ఈ రీమేక్ లో ఎవరు నటిస్తున్నారో చెప్పేశాడు. ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతు ఈ రీమేక్ లో రానా నటిస్తున్నాడని కన్ఫామ్ చేశాడు.
మరి తమిళ్ వర్షన్ డైరెక్ట్ చేసిన వెంకట్ ప్రభునే తీసుకుంటారా లేక వేరే తెలుగు డైరెక్టర్ ని తీసుకుంటారా చూడాలి. చూద్దాం మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























