తనపై కామెంట్స్ కు కిరణ్ సాలిడ్ రిప్లై..!

Young Hero Kiran Abbavaram Solid Reply About Negative Comments, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Hero Kiran Abbavaram, Kiran Abbavaram, Kiran Abbavaram About Negative Comments, Hero Kiran Abbavaram Latest News, Kiran Abbavaram New Movie Update, Kiran Abbavaram Upcoming Movie, Kiran Abbavaram Journey, Kiran Abbavaram Movies

కిరణ్ అబ్బవరం.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. ముఖ్యంగా యూత్ కు. చేసింది తక్కువ సినిమాలే కానీ ఈ యంగ్ హీరో మాత్రం ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతున్నాడు. దానికి కారణం కిరణ్ కు వరుసగా వస్తున్న అవకాశాలే. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు వరుసగా అవకాశాలు రావడం కామన్ థింగే. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకండా తెలుగు తెరకు పరిచయమైన కిరణ్ కు వరుసగా అవకాశాలు రావడమే కాదు.. అది కూడా పెద్ద బ్యానర్లలో సినిమాలు రావడం అంటే మాములు విషయం కాదు. రాజావారు రాణి వారు సినిమాతో కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చారు. అయితే అది పెద్ద సినిమా కాదు.. అలానే బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టలేదు. కానీ కిరణ్ మాత్రం ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. ఆ తరువాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా హిట్ ఇవ్వడంతో ఇక వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈమధ్య వచ్చిన సెబాస్టియన్ పీసీ524, రీసెంట్ గా వచ్చిన సమ్మతమే సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా కిరణ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం కిరణ్ గీతా ఆర్స్ట్ బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ, అలానే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మీటర్ సినిమా ఇంకా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలు ఇంకా పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు కిరణ్ కు వస్తున్న అవకాశాలపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వరుసగా అవకాశాలు ఎలా వస్తున్నాయి.. అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తనపై వస్తున్న కథనాలపై స్పందించిన కిరణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనకి మార్కులు తక్కువొచ్చినా ఫర్లేదు.. పక్కోడికి మాత్రం ఎక్కువ రాకూడదనే అసూయనే నాపై జరుగుతున్న ఈ ప్రచారానికి కారణం. నాకు ఎలాంటి నేపథ్యం లేదన్నది నిజం. నాకు ఇన్ని అవకాశాలు రావడానికి కారణం నా హార్డ్ వర్క్. నా గురించి నెగెటివ్ గా ప్రచారం జరుగుతుందంటే.. పాజిటివ్ రూట్ లోనే వెళుతున్నానని అర్థం” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ పనికోసమే నేను చాాలా సంవత్సరాలు తిరిగాను.. ఇప్పుడు ఈపని వచ్చినప్పుడు ఇష్టపడి చేస్తున్నాను.. ఈ ప్రాసెస్ లో నాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టీమ్ మెంబర్స్ ఇంకా ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ సమాధానం ఇచ్చాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.