సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ . అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “కోబ్రా “తమిళ మూవీ ఆగష్టు 11 వ తేదీ రిలీజ్ కానుంది.మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ హీరోగా , కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రెండు భాగాలుగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “పొన్నియిన్ సెల్వన్ “మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. తాజాగా విక్రమ్ హీరోగా మరో మూవీ తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నీలం ప్రొడక్షన్స్ , స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై “కబాలి”,”కాలా” మూవీస్ ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా 1800 కాలం నాటి కథాంశంతో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ “విక్రమ్ 61” తమిళ మూవీ తెరకెక్కనుంది. 3డి ఫార్మాట్ లో తెరకెక్కనున్న ఈ మూవీ శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ పూజా కార్యక్రమాల్లో హీరో విక్రమ్ కూడా పాల్గొన్నారు.ఇందులో పవర్ ఫుల్ పాత్రలో విక్రమ్ కనిపించనున్నట్లు సమాచారం. .తమిళంతో పాటు తెలుగు,హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: