‘యశోద’ సమంత గట్స్ కి హ్యాట్సాఫ్..!

Yashoda Movie Directors Superb Words About Samantha,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yashoda,Yashoda Movie,Yashoda Movie Updates,Yashoda Telugu Movie,Yashoda New Movie Updates,Samantha Upcoming Movie Yashoda,Yashoda Movie Ddirector Hails Samantha, Yashoda Movie Director Hails Samantha,Samantha Upcoming Movie,Samantha New Movie Updates,Samantha Yashoda Movie Updates,Samantha New Movie Updates,Samantha Next Project

ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమంత ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆసినిమా తరువాత సమంత పెద్దగా వెనుక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా అవకాశాలతో మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా ఎక్కువ శాతం సక్సెస్ రేటునే సొంతం చేసుకొని లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి సమంత దశాబ్దం అయిపోయింది. అయినా కూడా ఇంకా స్టార్ హీరోయిన్ గా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూనే ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా, యశోద సినిమా చేస్తున్నాడు. వీటిలో శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుండగా.. యశోద సినిమా షూటింగ్ దశలో ఉంది. సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో హరి, హరీష్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అందరికీ ఆసక్తి కలిగింది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోవడంతో ఈసినిమా డైరెక్టర్స్ హరీష్, హరి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు మీడియాతో పంచుకున్నారు. అంతేకాదు సమంతపై ప్రశంసలు కూడా కరిపించారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ చేయడానికి ముందే సమంతని కలిసి యశోద స్టోరీ వినిపించడం, ఆమె ఓకె చేయడం జరిగిందన్నారు. ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసారని, ముఖ్యంగా కొన్ని సీన్స్ కోసం ఆమె కొన్నాళ్ల పాటు సెట్స్ లోనే గడపడం మాత్రమే కాదు, పలు ఫైట్స్ లోని రిస్కీ షాట్స్ ని ఎంతో డేరింగ్ గా చేసారని, నిజంగా ఆమె గట్స్ కి హ్యాట్సాఫ్ అన్నారు.

కాగా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.