పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “కార్తికేయ 2 “మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది. “కార్తికేయ 2 ” మూవీ ని జూలై 22 రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ మూవీ విడుదల వాయిదా పడింది. “కార్తికేయ 2 ” మూవీ జూలై 22న రిలీజ్ కావట్లేదని బహుశా ఆగస్ట్ మొదటి వారంలో రిలీజ్ చేస్తున్నట్టుగా హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: