హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“బీస్ట్” తమిళ మూవీ లో స్టార్ హీరో విజయ్ కు జోడీగా నటించి పూజాహెగ్డే ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తాజాగా పూజాహెగ్డే కోలీవుడ్ లో మరో భారీ ఆఫర్ అందుకున్నారని సమాచారం. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో సూర్య కు జోడీగా పూజాహెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం. ప్రస్తుతం హీరో సూర్య , దర్శకులు బాలా, వెట్రిమారన్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































