రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్టర్లు, గ్లింప్స్ కు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజకీయ అంశాలతో కూడిన పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న “మాచర్ల నియోజకవర్గం ” మూవీ లో తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అంజలి ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. హీరో నితిన్ ,అంజలి పై తెరకెక్కిన ‘‘రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ’’ అనే స్పెషల్ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ మాస్ జాతరను శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో జూలై 9న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























