సూపర్ హీరో పాత్రలో చేయాలనుంది..!

Taapsee Wants To Act In A Super Hero Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Taapsee Pannu,Actress Taapsee Pannu,Taapsee Pannu Movie Updates,Taapsee Pannu latest Updates,Taapsee Pannu Upcoming Movies,Taapsee Pannu Latest Movie Updates,Taapsee Pannu Upcoming Movies, Taapsee Pannu Wants To Act in Super Hero Role in a Movie,Taapsee Pannu Super Hereo Role,Taapsee Pannu Upcoming movies,Taapsee Pannu Interview,Taapsee Pannu Latest Movie Udpates,Taapsee Pannu Next Projects,Taapsee Pannu Hindi Movies,Taapsee Pannu in Bollywood, Taapsee Pannu in Tollywood

ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ కు డ్రీమ్ రోల్స్ అంటూ కొన్ని ఉంటాయి. ఎన్ని సినిమాలు చేసినా తమకంటూ కొన్ని పాత్రల్లో చేయాలని ఉంటుంది. అప్పుడప్పుడు తమ డ్రీమ్ రోల్స్ గురించి ఇంటర్వ్యూలలో బయటపెడుతుంటారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ కూడా తన డ్రీమ్ రోల్ ఏంటో బయటపెట్టింది. తాప్సీ ప్రధాన పాత్రలో భారత మహిళా వన్డే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా శభాష్ మిథు టైటిల్ తో ఆమె బయోపిక్‌ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ బయోపిక్ లో మిథాలీ జీవితానికి సంబంధించి.. తన క్రికెట్ ఆరంగేట్రం గురించి ఎన్నో కీలకమైన అంశాలను చూపించనున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం అయితే రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై 15వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్న తాప్సి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన డ్రీమ్ రోల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తనకు మొదటి నుండి అవెంజర్స్ లో ఒక సూపర్ హీరో పాత్ర చేయాలని ఉందని..  అయితే అవెంజర్స్ లో ఇప్పటికే వచ్చిన హీరోల పాత్రలో కాకుండా ఒక ఇండియన్ సూపర్ హీరో పాత్ర చేయాలని ఉందని తెలిపింది. చూద్దాం మరి ఫ్యూచర్ లో తాప్పీ డ్రీమ్ నెరవేరుతుందేమో.

కాగా శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇక ఇటీవలే రిలీజ్ అయిన ఈసినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి ఈసినిమా తాప్సీ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.