మంచు మోహన్ బాబు వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. మొదట బుల్లి తెర ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తుంది. రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేస్తూ ఉంటుంది మంచు లక్ష్మీ. అయితే మోహన్ బాబు తో మంచు విష్ణు, మంచు మనోజ్ ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్నారు కానీ మంచు లక్ష్మీ మాత్రం ఇప్పటివరకూ చేయలేకపోయింది. కానీ మొదటిసారి ఇప్పుడు తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మోహన్ బాబు, లక్ష్మీ ఇద్దరూ నటిస్తున్నారు. అయితే ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా టైటిల్ ను నేడు ప్రకటించారు. అగ్నినక్షత్రం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఈసందర్భంగా మంచు లక్ష్మీ కూడా ఈవిషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. ఈ రోజు నా కల నిజమైంది. నేను మా నాన్నతో కలిసి తెలుగు సినిమాలో నటిస్తున్నాను. ఆయనతో కలిసి నిర్మించే అవకాశం వచ్చింది. చాలా ఉద్వేగభరితంగా ఉంది. మా సినిమా టైటిల్‌ను అధికారికంగా వెల్లడించడానికి నేను చాలా సంతోషిస్తున్నా అంటూ తెలిపారు.
Today’s the day!
I am most excited to officially reveal the title of our movie: #Agninakshtram!
Want all your blessings🙏🏻@themohanbabu #PrateekPrajosh @thondankani @mynameisViswant @Chitrashukla73 @VrenThambidorai @Gemini4Suresh @bhimajiyanideep @PoornimaRamasw1 pic.twitter.com/fYAGo5fImR— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) July 1, 2022
ఇంకా ఈసినిమాలో మళయాళం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిద్దిక్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ & మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. డైమండ్ రత్నబాబు స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి కెమెరామెన్ సాయిప్రకాష్, మ్యూజిక్ ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























