‘ది వారియర్’ ట్రైలర్ రిలీజ్

The Warriorr Movie Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Warriorr,The Warriorr Movie,The Warriorr Telugu Movie,The Warriorr Movie Trailer,The Warriorr Telugu Movie Trailer,Ram Pothineni,Hero Ram Pothineni,Ram Pothineni The Warriorr Movie Trailer out Now, Ram The Warriorr Movie Trailer Updates,Ram Pothineni Upcoming Movie The Warriorr Trailer Out Now,The Warriorr Movie Trailer Released, Ram Pothineni Upcoming Movies,Ram Pothineni latest Movie Updates,Ram Pothineni New Movie Updates,Ram Pothineni New Movie The Warriorr Trailer Released

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఆ తర్వాత రెడ్ సినిమా చేయగా అది మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఇక ఇప్పుడు మరో మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా తెరకెక్కింది. ఈసినిమా జులై 14వ తేదీన రిలీజ్ అవుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పాటలు, పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి అప్ డేట్ సినిమాపై మంచి హైప్ నే క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ తో తన సత్తా చూపించిన రామ్ ట్రైలర్ లో చెలరేగిపోయాడు. ఈసినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో నటిస్తున్నాడు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా కర్నూల్ వెళ్లిన సత్య.. అక్కడ విలన్ గురుతో చేసే యుద్ధమే ఈసినిమా అని అర్థమవుతుంది. అక్కడే కృతి శెట్టి- రామ్ మధ్య ప్రేమ మొదలైనట్టు కూడా ట్రైలర్ లో చూపించారు. పోలీసోడి పోరీని నేను అని చెప్పే డైలాగ్ చాలా క్యూట్‌గా అనిపించింది. రామ్-కృతిశెట్టి కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా ఈసినిమా రిలీజ్ చేస్తుండటంతో.. పాన్ ఇండియా సినిమా చూసి ఉంటారు.. పాన్ ఇండియా రౌడీలను చూశారా అంటూ రామ్ చెప్పే డైలాగ్‌ని ఆకట్టుకుంటుంది. ఇక విలన్ పాత్రలో మరోసారి ఆది పినిశెట్టి తన మ్యాజిక్ ను చూపించేలా కనిపిస్తున్నాడు.

కాగా ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది. అక్షర గౌడ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =