సినిమా జయాపయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ లో ఉన్న విలక్షణ నటుల్లో ఒకరైన శ్రీవిష్ణు. గత ఏడాది ‘గాలి సంపత్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈఏడాది అర్జున ఫల్గుణ, భళా తందనాన అనే సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను సిద్దం చేస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా టైటిల్ ను అలానే ప్రీ లుక్ ను చాలా రోజుల క్రితమే రిలీజ్ చేశారు. అల్లూరి అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఈసినిమాలో శ్రీవిష్ణు పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈసినిమా నుండి తాజాగా ఈసినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి శ్రీవిష్ణు పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నిజాయితీకి మారు పేరు అంటూ రిలీజ్ చేసిన ఈ పవర్ ఫుల్ లుక్ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజాయితీకి మారుపేరు ..
అల్లూరి ! 👮🏻♂️🔥Here’s the Powerful First Look of @sreevishnuoffl‘s #𝗔𝗟𝗟𝗨𝗥𝗜 💥#AlluriFirstLook 🚨
Directed by #PradeepVarma 🎬@rameemusic #RajThota @luckymediaoff @BekkemVenugopal #Babita pic.twitter.com/2vkYwauOjM— LuckyMedia (@luckymediaoff) July 1, 2022
కాగా కయ్యదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, మధుసూధన్ రావు, జయవాణి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాను లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. శివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈసినిమాను కూడా ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: