డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. మరోవైపు మేకర్స్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి కొత్తగా లేదేంటో అన్న పాటను రిలీజ్ చేయగా ఆపాట మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకూ వచ్చిన ఉప్పెన, కొండపొలం సినిమాల్లో కాస్త సెటిల్డ్ గా నటించిన వైష్ణవ్ తేజ్ ఈసినిమాలో లవర్ బాయ్ పాత్రలో అలానే కామెడీ యాంగిల్ ను కూడా చూపించబోతున్నట్టు అర్థమవుతుంది. ‘నన్నే చూస్తావ్.. నా గురించే కలలు కంటావ్.. నన్నే ప్రేమిస్తావ్.. కానీ నీకు నాతో మాట్లాడటానికి ఇగో’ అంటూ కేతిక చెప్పే డైలాగ్స్‌తో టీజర్ మొదలయిన ఈ టీజర్ లో వైష్ణవ్ తేజ్, కృతిక కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ గా నిలివనున్నట్టు అర్థమవుతుంది. ఇక టీజర్ చివర్లో వైష్ణవ్ తేజ్ పవన్ కళ్యాణ్ ఎక్స్ ప్రెషన్ ను పెట్టడం హైలెట్ గా నిలిచింది. దీనికితోడు దేవి మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.
It’s time to celebrate and Fall in Love ❤️
Here’s presenting you, #RangaRangaVaibhavanga teaser 😍
▶️ https://t.co/HAxwlhO1Z1#PanjaVaisshnavTej @TheKetikaSharma @ThisIsDSP @GIREESAAYA @SVCCofficial @BvsnP @SonyMusicSouth #RRVTeaser pic.twitter.com/y4vtNaBp0q
— SVCC (@SVCCofficial) June 27, 2022
కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో.. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శామ్ దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































