“యశోద ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi Sarathkumar wraps up Yashoda movie shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Varalakshmi Sarathkumar,Actress Varalakshmi Sarathkumar,Varalakshmi Sarathkumar Movie.Varalakshmi Sarathkumar Telugu Movie Updates,Varalakshmi Sarathkumar Yashoda Movie Wraps Up, Yashoda,yashoda Movie,Yashoda Telugu Movie,Yashoda latest Movie Updates,Yashoda Movie Latest News,Yashoda Movie Completes Shoot,Yashoda Movie Wraps Up,Yashoda Movie Shooting Wraps up

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “యశోద” మూవీ ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ కానుంది.ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “యశోద” మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “యశోద”మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. “యశోద “మూవీ కి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసినట్టుగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.”యశోద” టీమ్‌కి చాలా కృతజ్ఞతలనీ ,ఇది తనకు ఒక ర్యాప్ అనీ , మీ అందరితో కలిసి షూటింగ్ జరుపుకున్నందుకు ఆనందంగా ఉందనీ వరలక్ష్మి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.