పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో నటిస్తున్న రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ , రణ్ బీర్ కపూర్ “యానిమల్ “ బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు. “బ్లాక్ బస్టర్ “పుష్ప:ది రైజ్ ” శ్రీవల్లి గా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన రష్మిక హిందీ డబ్బింగ్ వెర్షన్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలాజీ మోషన్ పిక్చర్స్ , రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై వికాస్ బహెల్ దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ , రష్మిక ప్రధాన పాత్రలలో “గుడ్ బై హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రష్మిక ముంబై చేరుకున్నారు. ఈ షెడ్యూల్ లో రష్మిక పై కొన్ని సన్నివేశాలు , ఒక సాంగ్ ను దర్శకుడు చిత్రీకరించనున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: