తమిళ ప్రజల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ పలు తమిళ , తెలుగు , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ తన 169 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు సేవ కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రజనీకాంత్ 169 వ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై “డాక్టర్”, “బీస్ట్”మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రజనీకాంత్ 169 వ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో ఐశ్వర్య రాయ్ కథానాయిక పాత్రలో నటించే అవకాశం ఉంది. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటించనున్న రజనీకాంత్‌లోని మాస్, హీరోయిజం హంగులను కొత్త పంథాలో ఆవిష్కరిస్తూ దర్శకుడు నెల్సన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ,కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “క్రిమినల్ “మూవీ టైటిల్ ను రజనీకాంత్ 169 వ మూవీ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























