‘బ్రహ్మస్త్ర’ నాగ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్..!

Nagarjuna Intense Look from Brahmastra out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra kovie Updates,Brahmastra latest Movie Updates,Brahmastra nagarjuna latest Look Released, nagarjuna New Look In Brahmastra Movie,Nagarjuna Brahmastra Movie Updates,Nagarjuna Intens Look in Brahmastra part 1 Movie,Brahmastra movie latest Updates

బాలీవుడ్ లో ఈఏడాది వస్తున్న పెద్ద సినిమాల్లో బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్టార్ జంట రణబీర్ కపూర్ మరియు అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈసినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికితోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన పలు గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈసినిమాను మొదట ఒక పార్ట్ మాత్రమే అనుకున్న ఆ తరువాత కథ ప్రకారం మూడు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. ఈసినిమా రిలీజ్ కు సరిగ్గా 100 రోజుల టైమ్ ఉందన్న నేపథ్యంలో ట్రైలర్ అప్ డేట్ ఇచ్చారు. జూన్ 15వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ట్రైలర్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈసినిమాలోని కీలక పాత్రల్లో నటిస్తున్న వారి పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. గురు పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న నాగార్జున పవర్ ఫుల్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో నాగ్ అనిష్ శెట్టి అనే పాత్రలో నటిస్తుండగా.. నంది అతని అస్త్రం అన్నట్టు తెలిపారు.

ఇక ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ ప్రమాణాలతో సమానంగా ఉండబోతున్నట్టు ఇప్పటికే అర్థమైపోయింది. ఈసినిమా పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటుగా తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కానుంది. ఈసినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా బ్ర‌హ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.