“విక్రమ్ “మూవీ పై దర్శకుడు శంకర్ ప్రశంసలు

Shankar Appreciates Vikram Movie Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Director Shankar,Shankar About Vikram Movie,Director Shankar Praises Vikram Movie,Shankar Loved Vikram Movie,Vikram Movie Latest Updates,Vikram Movie Blockbuster Hit, Director Shankar Upcoming Movies,Director Shankar Latest Movie Updates,Shankar All About Vikram Movie,Kamal Haasan Upcoming Movies,Kamal Haasan Vikram Movie Updates, Kamal Haasan Latest Blockbuster Movie

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కీలక పాత్రలలో నటించిన విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విక్రమ్ ” తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మార్కుకు చేరువలో ఉన్న ఈ మూవీ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కి చేరడం విశేషం. “విక్ర‌మ్”మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసిస్తున్నారు. తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ “విక్ర‌మ్” మూవీపై ప్ర‌శంస‌లు కురిపించారు.క‌మల్ హాస‌న్ ట్రూ లెజెండ్ అనీ , 360 డిగ్రీ యాంగిల్‌లో త‌న పెర్ఫార్మెన్స్ చూపించి క‌మ‌ల్ అద‌ర‌గొట్టారనీ , దర్శకుడు లోకేష్ ప‌నితీరు బాగుందనీ , అనిరుధ్ బ్యాక్‌గ్రాండ్ స్కోర్ కూడా బాగుందనీ , . చిత్ర యూనిట్‌కి తన శుభాకాంక్ష‌లు అంటూ శంక‌ర్ ట్వీట్‌ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.