టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న సినిమా విరాటపర్వం. ఇద్దరు టాలెంటెడ్ నటీనటుల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భాపీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కూడా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కరోనా వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. మధ్యలో ఈ సినిమా మీద ఎన్నో రూమర్లు కూడావచ్చాయి. ఓటీటీలో వస్తుందంటూ రకరకాల పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. అయితే థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఈ సినిమా మాత్రం జూన్ 17న థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలు రాజు ఎవడు.. సామ్యవాద పాలననే స్థాపించగ ఎన్నినాళ్లు.. అంటూ రానా గంభీరంగా చెప్పిన డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. నీకు నేను అభిమానిని అయిపోయా.. నాలో ఏదో భావోద్వేగం రగులుతోంది.. ఈ భావోద్వేగానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు.. నోరులేని సమాజానికి నోరందించుళ్లు సర్ అంటూ అన్నల గురించి చెప్పిన డైలాగ్ అందరినీ టచ్ చేసేలా ఉంది. నా కళ్లలో నిజాయితీ కనిపిస్త లేదా.. ప్రేమ కనిపిస్త లేదా? అని సాయి పల్లవి చెప్పిన డైలాగ్.. ఇక్కడ రాత్రి ఉండదు పగలు ఉండదు.. ఉన్నదల్లా ఊపిరికి ఊపిరికి మధ్య ఊపిరి సలపనంత యుద్దమే.. అసలు చావు కేకలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? అని రానా చెప్పడం చూస్తే ఈసినిమాలో డైలాగ్స్ హైలెట్ గా నిలచేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి రానా, సాయిపల్లవి తమ మ్యాజిక్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నారు. మరి ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Oka yuddham enno praanaalu theesthundi, kaani adhe yudham oka praanam posindhi#VirataParvam Trailer out now❤️🔥
▶️ https://t.co/JXFzWwPo32@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm #SureshBobbili #DivakarMani @dancinemaniac @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/tetfh1Y9SG
— Suresh Productions (@SureshProdns) June 5, 2022
కాగా యదార్ధ సంఘటనల ఆధారంగా 1990 కాలంనాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈసినిమాలో రానా రవన్న పాత్రలో అలానే సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటిస్తుంది ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































