కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. తీసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు కూడా స్టార్ హీరో విజయ్ తో చేసినవే. మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే బాలీవుడ్ బాద్ షాతో చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఎప్పుడో కరోనాకు ముందు షారుఖ్-అట్లీ సినిమాని అనౌన్స్ చేశారు. కానీ ఇన్ని రోజులు కరోనా ఉండటం.. మధ్యలో పలు కారణాల వల్ల ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా లేట్ అయింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ని అనౌన్స్ చేయలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. జవాన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేస్తూ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక అంతేకాదు రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్ 2న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. షారుక్ ముఖానికి ఓ బట్ట కట్టుకుని చేతిలో గన్‌తో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
Feeling emotional, excited & blessed .
Grew up admiring you but never imagined that I would be directing you sir.@iamsrk & I proudly present to you #Jawan https://t.co/UsquV4MRC8
Releasing on 2nd June 2023, in Hindi, Tamil, Telugu, Malayalam & Kannada@gaurikhan @RedChilliesEnt— atlee (@Atlee_dir) June 3, 2022
కాగా ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాలో షారుక్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ నిర్మించనున్నారు.
ఇక షారుక్ కూడా చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. దానికితోడు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసి దాదాపు నాలుగేళ్లైపోయింది. ఈనేపథ్యంలో అభిమానులు షారుక్ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఇంకా షారుక్ సిద్దార్థ్ ఆనంద్‌తో పటాన్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు రాజ్‌కుమార్ హిరానీతో డంకీ మూవీ చేస్తున్నాడు. మొత్తానికి వచ్చే ఏడాది మాత్రం షారుక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ ట్రీట్ ఇవ్వనున్నట్టు అర్థుమవుతుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























