విజయ్ &విజయ్ “జ్వాల” మూవీ టీజర్ రిలీజ్

Vijay Antony and Arun Vijay Jwala Movie Teaser Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jwala,Jwala Movie,Jwala Movie Teaser,Jwala Telugu Movie,Jwala Telugu Movie Teaser updates,Jwala Movie Latest Updates,Jwala Movie Updates,Jwala New Movie Updates, Jwala Movie Teaser Released,Jwala Movie Telugu Teaser Released,Vijay Antony Jwala Movie Teaser Released,Vijay Antony upcoming Movies,Vijay Antony New Movie Udpates, Vijay Antony Upcoming Movie Jwala Movie Latest Teaser Released,Vijay Antony and Arun Vijay Jwala Movie

అమ్మ క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని , అరుణ్ విజయ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “అగ్ని సిరాగుగళ్ “తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “జ్వాల” మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ మూవీ లో అక్షర హాసన్ కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్, రైమాసేన్ , నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. అమ్మ క్రియేషన్స్ టి.శివ సమర్పణలో శర్వాంత్రామ్ క్రియేషన్స్ , షిరిడిసాయి మూవీస్ బ్యానర్స్ పై తెరకెక్కిన “జ్వాల”మూవీ కి నటరాజన్ శంకరన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతికతతో భారీ స్థాయిలో రష్యా , కజకిస్తాన్ , ఉజ్బెకిస్తాన్ , స్విట్జర్లాండ్ – కలకత్తాలతో పాటు అనేక దేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ టీజర్ ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అద్భుతమైన విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో రూపొందిన యాక్షన్-ప్యాక్డ్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ ఆంటోని , “బ్రూస్ లీ “, “సాహో” వంటి మూవీస్ తో అలరించిన అరుణ్ విజయ్ పోటీపడి నటించిన “జ్వాల” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.