సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ “మేజర్ “మూవీతో అలరించనున్నారు.సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ జూన్ 3వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ మూవీ లో శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ ,మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మేజర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. “మేజర్” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మే 27న వైజాగ్‌లో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఆడియెన్స్‌కు ప్రీమియర్ షో చూపించిన తరువాత ఇలా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న తొలి సినిమాగా “మేజర్” నిలిచిందని చిత్ర యూనిట్ తెలిపింది.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























