డ్రీమ్ వారియర్ పిక్చర్స్ , వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరో గా తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ఖైదీ” తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ “ఖైదీ ఘనవిజయం సాధించాయి. హీరోయిన్ , సాంగ్స్ లేకుండా ఈ మూవీ తెరకెక్కడం విశేషం. హీరో కార్తీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఖైదీ” మూవీ సీక్వెల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు “ఖైదీ”మూవీ రష్యన్ భాషలో డబ్బింగ్ జరుపుకుని రష్యా లో 121 సిటీస్, 297 స్క్రీన్స్ లో 19 వ తేదీ భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీయల్గా ప్రకటించారు. ఇలా ఒక భారతీయ ప్రాంతీయ భాషా చిత్రం .. రష్యాలో భారీ లొకేషన్స్ లోనూ, స్క్రీన్స్ లోనూ విడుదలవటం విశేషం. ఈ మూవీ తో దర్శకుడిగా పరిచయం అయిన లోకేష్ కనగరాజ్ “ఖైదీ” మూవీ ని గ్రిప్సింగ్ స్క్రీన్ ప్లేతో, ఆసక్తిని రేపే సన్నివేశాలతో.. చక్కటి ఎమోషన్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: