పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.“F 3” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.17 వ తేదీ నుండి 28 వ తేదీ వరకూ జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలకు భారత ప్రతినిధిగా పూజాహెగ్డే హాజరు అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పూజాహెగ్డే రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్నారు. వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా ఉన్న పూజాహెగ్డే రెడ్ కార్పెట్ పై వాకింగ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్న పూజాహెగ్డే మాట్లాడుతూ .. తన డ్రీమ్ నెరవేరిందనీ , ఇండియా తరుఫున ఈ వేడుకకు హాజరవడం పెద్ద గౌరవంగా ఫీల్ అవుతున్నాననీ , ఇండియన్ సినిమా సెలబ్రేషన్స్ లో ఒక ఇండియన్ యాక్ట్రెస్ గా పాల్గొన్నా ననీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: