యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా ఫణికృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా క్రైజీ ఫెలో. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక నేడు ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా వుంది. ఆది సాయికుమార్ ఫస్ట్ లుక్ లో చాలా యంగ్ అండ్ రిఫ్రెషింగ్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ వీడియోలో ఆది చేష్టలు సినిమా టైటిల్ కి తగ్గట్టు చాలా క్రేజీగా వున్నాయి. ఆది వేసుకున్న టీషర్టు పై ‘ఎవడి యాంగిల్ వాడిది”అని రాసిన క్యాప్షన్ సినిమాలో హీరో పాత్రని సూచిస్తుంది. హెయిర్ స్టయిల్ , ట్రెండీ దుస్తులు అది లుక్ ని మరింత స్టయిలిష్ గా చూపించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Have a look at our #CrazyFellow 🕺 @AadiSaikumar, who came to turn your timeline Crazy🤟#CrazyFellowLook@DiganganaS @mirnaaofficial @siriki_phani @SriSathyaSaiArt @KKRadhamohan #RRDhruvan #SatishMutyala @GiduturiSatya @adityamusic @UrsVamsiShekar pic.twitter.com/4mWlWHDyy9
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) May 19, 2022
కాగా ఈసినిమాలో ఆది సాయికుమార్ సరసన దిగాంగన సూర్యవన్షీ, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధృవ సంగీతం అందిస్తున్నాడు. సతీష్ ముత్యాల ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.