స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 32 రోజులలో 1200 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ 2 “మూవీ లో ప్రధాన మంత్రిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఈ మూవీ సక్సె పై స్పందించారు. రవీనా మాట్లాడుతూ .. తనపై ప్రేక్షకుల ప్రేమ , పాజిటివ్ రెస్పాన్స్ కు చాలా సంతోషంగా ఉందనీ , 90 లలో థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు “కె జి ఎఫ్ 2 “మూవీ కి వచ్చిందనీ , ఆ రోజులను “కె జి ఎఫ్ 2 “మూవీ వెనక్కి తీసుకుని వచ్చిందనీ , ఇది భారతీయ చలన చిత్ర పరిశ్రమ కు గ్రేట్ టైమ్ అనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: