‘మేజర్’.. ‘ఓ ఇషా’ వీడియో సాంగ్ రిలీజ్..!

Oh Isha Song from Major Released,Oh Isha Video Song From Adivi Sesh’s Major Movie Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu movie,Major Movie Updates,Major Latest Movie Updates,Major upcoming Movie,Major Movie Songs,Major oh Isha Video Song Out Now,Major Movie Song oh Isha Video Song Released, Oh Isha Video Song Released,Oh Isha Video Song From Major Released,Adivi Sesh Major Movie Oh Isha Video Song Released,Adivi Sesh Major Movie Songs,Adivi Sesh Upcoming Movie Updates, Oh Isha Video Song,Major Songs,Major Telugu Movie Songs,Major Telugu Movie Song oh Isha

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో వర్సటైల్ హీరో ఎవరంటే అడివి శేష్ పేరు చెప్పొచ్చు. తను మొదటి నుండి చేస్తున్న సినిమాలను బట్టి చెప్పొచ్చు విభిన్న పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. మహేష్ బాబు కూడా నిర్మాత కాబట్టి ఆయన కూడా అప్పుడప్పుడు ప్రమోషన్స్ లో చేయి వేస్తున్నారు. ఇక మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి సెకెండ్ సింగిల్ ”ఓ ఇషా’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఒక గెట్ టుగెదర్ లో ఆర్మీ అధికారుల తమ లైఫ్ పార్ట్నర్స్ తో డ్యాన్స్ చేస్తున్నపుడు మేజర్ సందీప్ గా శేష్ తన తొలిప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో పాట మొదలైయింది.

కాగా అడివి శేష్ కెరీర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =