వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇక కేవలం నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు అడివి శేష్. తన నటించిన మేజర్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా హిట్ సీక్వెల్ హిట్ 2 సినిమాలో కూడా అడివి శేష్ నటిస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తను టాలీవుడ్ లో ఈస్థానం సంపాదించుకోవడానికి స్టార్ హీరోల సహకారమే అని చెబుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ తన సినిమా గురించి చెబుతూ ఇంకా పలు ఆసక్తిర విషయాలు తెలియచేశారు. నా సినిమా క్షణం రిలీజ్ అయి హిట్ అయిన తరువాత మొదటి సారి అల్లు అర్జున్ గారు సినిమా బావుందని ట్వీట్ చేశారు. ఫస్టు టైమ్ ఆయన నా సినిమాను గురించి ట్వీట్ చేయడంతో నేను చాలా హ్యీపీగా ఫీలయ్యాను అని తెలిపారు. ఇక పంజా సినిమా చేస్తున్నప్పుడు కో డైరెక్టర్ వచ్చి హీరో కంటే ఎక్కువ చేస్తున్నావు.. చూసుకో అని చెప్పారు. అప్పుడు పవన్ కల్యాణ్ గారు తను ఎలా చేయాలనుకుంటున్నాడో అలా చేయమని చెప్పారు. ఇక బాహుబలి టైం లో ప్రభాస్ గారు నన్నుచాలా బాగా చూసుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు గారు మేజర్ లాంటి సినిమాను ఇచ్చారు. ఇలా ఎంతోమంది స్టార్స్ నన్ను ఎంతో అభిమానంతో చూసుకున్నారు. వారందరి సహకారంతోనే నేను ఇలా ఉన్నాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండటం చాలా హ్యాపీగా ఉంది అని తెలిపాడు.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























