ఆ పరిస్థితే వస్తే జాబ్ చేసుకుంటా..!

Nivetha Pethuraj opens up about Her Career

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ రేంజ్ కు రావాలంటే మాములు విషయం కాదు. అందులోనూ ఇప్పుడున్న కాంపిటీషన్ లో అది ఇంకా కష్టం. కొంతమంది హీరోయిన్లకు మాత్రమే అది కలిసొస్తుంది. అయితే కొంతమంది హీరోయిన్లకు టాలెంట్ ఉన్నా.. అవకాశాలు వస్తున్నా కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ ను మాత్రం అందుకోలేరు. కొంతమందికి అయితే ఆఫర్లు రావడమే కష్టమైపోతుంది. ఈనేపథ్యంలోనే తనకు కనుక ఆఫర్లు రాకపోతే ఉదోగ్యమైనా చేసుకుంటా అని అంటుంది ఓ యంగ్ హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా పేతురాజ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెంటల్ మదిలో మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది నివేదా పేతురాజ్. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆతర్వాత పలు సినిమాల్లో చేసినా సరైనా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన `అల వైకుంఠపురములో` సినిమాలో నటించినా కూడా నటించింది. అయినా కూడా బ్రేక్ రాలేదు. ప్రస్తుతం అయితే పలు సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా పేతురాజ్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. `హీరోయిన్ అవ్వడం కాదు.. నటి అనిపించుకోవడం గర్వంగా ఉంది . హీరోయిన్ గా సినిమాలు చేయకపోతే కెరీర్ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. నాకు అలాంటి భయం లేదు. నేను ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. నటకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలైనా చేస్తాను. ఒకవేళ ఆఫర్లు రాకపోతే ఉద్యోగం అయినా చేసుకుంటా. ఆ సత్తా నాకు ఉంది.` అంటూ చెప్పుకొచ్చింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 13 =