నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తెలుగు సినీ చరిత్రలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు అనేకం. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు… యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘిక, పౌరాణిక ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అన్నట్టు ఉంటుంది. సినీ చరిత్రలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. అలాంటి నటుడు ఇంత వరకూ రాలేదు.. ఇకపై కూడా అలాంటి నటుడిని చూడటం అనేది జరగదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసిన వారిలో ఎన్టీఆర్ ది మొదటి స్థానం అని చెప్పాలి. కేవలం సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ తన సత్తా చాటారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి.. కేవలం తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి పదవిని సాధించారు. అలా సినిమా రంగమైనా,రాజకీయ రంగమైనా అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ ఏడాది మే 28 నుంచి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరులో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తనయుడు బాలకృష్ణ చేతుల మీదుగా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభం కాన్నునాయి. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: