తమిళ్ స్టార్ హీరో సూర్య ఈమధ్య డిఫరెంట్ కథలతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈరెండేళ్లలో ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’, ‘ఈటీ’ సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. పలు అవార్డులను సైతం దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ బాలా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్లో 41వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై.. ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సముద్ర నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. కన్యాకుమారిలో ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలవ్వగా గత కొద్దిరోజులుగా అక్కడే షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది ఇక సెకండ్ షెడ్యూల్ ను జూన్ నుండి గోవాలో స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.
Simba and his purr-fect family. 💕🐾
Watch #OhMyDogOnPrime, now @PrimeVideoIN@Suriya_offl #Jyotika @arunvijayno1 @SarovShanmugam #VijayaKumar #ArnavVijay #VinayRai @rajsekarpandian #MahimaNambiar @gopinath_dop @nivaskprasanna #MichealRaj #Meghanathan @VinothiniRK pic.twitter.com/UQVAdwrY1e
— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 4, 2022
కాగా ఈసినిమాలో ఇప్పటికే టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ ను కూడా తీసుకోనున్నట్టు సమాచారం. ఈ సినిమాను 2డి ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై జ్యోతిక నిర్మిస్తున్నారు. జీవి ప్రకాశ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























