కె.జి.యఫ్ 3 గురించి యష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Yash Opens Up About KGF Chapter 3,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yash Interesting Comments on KGF Chapter 3,Yash Opens Up About KGF Chapter 3 Movie,Yash About KGF 3 Movie,KGF3 Movie Updates,KGF Fame Yash About KGF 3 Movie,KGF 3 Movie Updates, Yash KGF Chapter 2 Movie Updates,KGF 3 Movie latest Updates,Prashanth Neel KGF3 Movie Updates,Director Prashanth Neel movie KGF 3 Updates, Yash Comments on KGF3 Movie,Prahsnath Neel and Yash KGF 3 Movie Updates,Yash Upcoming Movie,Yash Movie Updates

కన్నడ రాక్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన కె.జి.యఫ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పార్ట్ 1 అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కూడా తెరకెక్కించారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈసీక్వెల్ రీసెంట్ గానే రిలీజ్ అయి సంచలన విజయం దక్కించుకుంది. విడుదలైన ప్రతి ఏరియాలో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. పార్ట్ 1 కు నార్త్ లో ఎలాగైతే మంచి రెస్పాన్స్ వచ్చి కలెక్షన్స్ కొల్లగొట్టిందో.. పార్ట్ 2 కూడా హిందీలో తొలి రోజు నుంచే బాక్సాఫీస్ షెక్ చేస్తుంది. చాలా వేగంగా 100 కోట్లను కొల్లగొట్టింది. మిగిలిన ఏరియాల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈసినిమాను మొదట ఒక సినిమాగానే తెరకెక్కించాలనుకున్నారు. కానీ మధ్యలోనే స్క్రిప్ట్ ను మరింత పెంచి రెండు పార్ట్ లుగా తీశారు. ఇక పార్ట్1 రీసెంట్ గా రిలీజ్ అయిన పార్ట్2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. దీంతో ఇప్పుడు కె.జి.యఫ్3 గురించి చర్చలు జరుగుతున్నాయి. దానికితోడు మరోవైపు పార్ట్ 2 ఎండింగ్ లో కూడా మరో సీక్వెల్ ఉందన్నట్టు హింట్ కూడా ఇచ్చాడు ప్రశాంత్ నీల్. దాంతో ఆ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.

ఇక రీసెంట్ గా యష్ కూడా కె.జి.యఫ్3 గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కె.జి.యఫ్ గురించి ప్రేక్షకులకు చెప్పడానికి ఇంకా చాలా కథ ఉందని.. నిజానికి సెకండ్ పార్ట్ లో చాలా సన్నివేశాలను పెట్టలేకపోయాము.. కాబట్టి ప్రేక్షకులు అన్నింటినీ మూడో చిత్రంలో చూడవచ్చని యష్ పంచుకున్నారు. ఎన్నో క్రేజీ సన్నివేశాలు ఉన్నాయి..చాప్టర్3 కి అవకాశం ఉందని కచ్చితంగా చెప్పగలను కానీ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుంది అనేది మాత్రం చెప్పడం కష్టంమని తెలియచేశారు. కె.జి.యప్ 2 లోనే యాక్షన్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.. మరి అంతకుమించి అంటే పార్ట్ 3 లో ఇంకే రేంజ్ లో ఉంటాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 2 =