బ్లాక్ బస్టర్ “కిరిక్ పార్టీ “మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ “ఛలో”మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “గీత గోవిందం “, “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ “, “పుష్ప :ది రైజ్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన రష్మిక సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. “పుష్ప :ది రైజ్ “హిందీ డబ్బింగ్ వెర్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో నటిస్తున్న రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీత్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గాతెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీలోరష్మిక కథానాయికగా నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “కబీర్ సింగ్ “మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ డ్రామా “యానిమల్ “హిందీ మూవీలో రణ్ బీర్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. పలు భాషల స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్న రష్మిక కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































