‘ఎఫ్ 3’ సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్

F3 Movie Second Song Promo Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Telugu Movie,F3 Movie Updates,F3 Latest Movie Updates,F3 upcoming Movie,F3 New Updates,F3 Shoot Updates,Venkatesh And Varun Tej Starrer F3, F3 Movie Song,F3 Movie Second Song,F3 Movie Second Song Released,F3 Telugu Movie Second Song Promo out Now,F3 Movie Second Song promo,Venkatesh and Varun Tej F3 Movie Second Song Released

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ఎఫ్3. 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నిజానికి ‘ఎఫ్3’ సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా మే27 న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ లో ఇన్ని రోజులు కాస్త సైలెంట్ గా ఉన్నారు మేకర్స్. అప్పుడెప్పుడో ఈసినిమా నుండి ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ అంటూ వచ్చే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. అప్పటి నుండీ పెద్దగా అప్ డేట్ ఇచ్చింది లేదు. ఇకఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ షురూ చేశారు. ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. వూ ఆ అహ అహ అంటూ వచ్చే సెకండ్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.

కాగా ఈసినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, రఘుబాబు, తులసి తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.