అమ్మకు ప్రేమతో మహేష్ బర్త్ డే విషెస్..!

Mahesh Babu Specials Wishes To His Mother On Her Birthday,Mahesh Babu Greets Mother Indira Devi On Her Birthday: Never Truly Enough Amma!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movie Updates,Mahesh Babu latest Movie Updates,Mahesh Babu Mmother Indira Devi,Mahesh Babu Mother Birthday,Mahesh Babu Mother Indira Devi Birthday, Indira Devi Birthday,Mahesh Babu Greets Mother Indira Devi On Her Birthday,Mahesh Babu Greets his Mother Indira Devi on her Birthday,Mahesh babu wish Her mother on her Birthday,Mahesh Babu in social media, Mahesh Babu Shared a post in social media and greet her mother Indira Devi

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు మాత్రమే కాదు.. స్పెషల్ డేస్ ను సైతం తన సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఇక నేడు మహేష్ కు స్పెషల్ డే. అదేంటంటే ఈరోజు మహేష్ అమ్మ ఇందిరమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ బాబు తల్లికి బర్త్ డే విషెస్ తెలియజేసారు. హ్యాపీ బర్త్ డే అమ్మా అంటూ ఇందిరమ్మ ఫొటోను షేర్ చేశాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ అందరూ మహేష్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరమ్మ దంపతలుకు మహేష్ బాబు నాల్గో సంతానం అన్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

కాగా ప్రస్తుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ రీసెంట్ గానే పూర్తిచేసుకుంది. ఒక్క పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. త్వరలో అది కూడా పూర్తిచేయనున్నారు. ఇక ఈసినిమా మే 12న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విడుద‌లకు ఇంకో నెల రోజులు కూడా లేకపోవడంతో ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాట‌లు విడుద‌లై మంచి రెస్పాన్స్ ను సొంతంచేసుకున్నాయి. త్వరలో మూడో పాట‌ను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 1 =